గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు… డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ.1.58కోట్లు …. మురుగునీటి డ్రెన్లలో తూడు,కాడ తొలగింపుకు రూ.90.30లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడి
కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను….ఎక్కడికక్కడ రైతులు దగ్గరుండి పర్యవేక్షించాలి:ఎమ్మెల్యే రాము
రైతులకు ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఎకరా తడుస్తుంది…. ఒక్క ఎకరా కూడా వర్షపు నీటితో మునగనివ్వను
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కామెంట్స్
నియోజకవర్గ పరిధిలోని 8 నీటి చానల్స్ లో అభివృద్ధి పనులకు ఒక కోటి,58 లక్షల, 55 వేల నిధులు మంజూరు.
ఐదు డ్రైనేజీ కాల్వల్లో అభివృద్ధి పనులకు 90లక్షల,30వేల నిధులు మంజూరైనట్లు వెల్లడి.
టెండర్ల దశ పూర్తి కాగా…. కాలువల్లో అతి త్వరలో ప్రారంభం కానున్న అభివృద్ధి పనులు.
కాలువల్లో జరిగే అభివృద్ధి పనుల్లో….. ఎక్కడికక్కడ రైతులు భాగస్వామ్యులు కావాలి.
రైతన్నలందరూ శ్రద్ధ వహించి కాలువల్లో, డ్రైన్లలో సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం అయ్యేలా…. ఎక్కడికక్కడ రైతన్నలు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలి.
రైతన్నలకు ఇచ్చిన హామీ మేరకు కాలవల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న.
పనులన్నీ సక్రమంగా జరిగేలా రైతన్నలు కూడా తమవంతు సహకారం అందించాలి.