TEJA NEWS

గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగిన సీనియర్ టిడిపి నాయకుడు పిన్నమనేని బాబ్జి పుట్టినరోజు వేడుకలు

బాబ్జికు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన.. అభిమానులు..కూటమి నాయకులు.. పట్టణ ప్రముఖులు.. సామాజికవేత్తలు

నమ్ముకున్న వారి కోసం ప్రాణం పెడుతూ… సిద్ధాంతాలతో రాజకీయాలు చేసే గొప్ప నాయకుడు బాబ్జి:కూటమి నాయకులు

సీనియర్ టిడిపి నాయకుడు పిన్నమనేని బాబ్జి పుట్టినరోజు వేడుకలు బాబ్జి యువసేన అధ్యక్షుడు పైడిముక్కల వంశీ..మరియు అభిమానుల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఘనంగా జరిగాయి.

గుడివాడ భాస్కర్ థియేటర్ ప్రాంగణంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పలువురు కూటమి నాయకులు.. పట్టణ ప్రముఖులు.. పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని బాబ్జికు శాలువాలు, జ్ఞాపికలు, పుష్పగుచ్చాలతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అభిమానులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్ ను బాబ్జి కట్ చేశారు. అనంతరం పిన్నమనేని బాబ్జి పుట్టినరోజు సందర్భంగా ముద్రించిన ప్రత్యేక క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.

ప్రజలకు సేవలు చెయ్యడంలో పిన్నమనేని కుటుంబం ఎప్పుడూ ముందే ఉంటుందని,లక్షలాది రూపాయలతో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాబ్జి ఆదర్శప్రాయుడని జనసేన పార్టీ ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్ కొనియాడారు.

నేటి సమకాలీన రాజకీయాల్లో గాంధేయ వాదంతో పిన్నమనేని కుటుంబ వారసత్వాన్ని బాబ్జి విజయవంతంగా కొనసాగిస్తు, జనసేన పట్టణ కార్యదర్శి సాయన రాజేష్ అన్నారు.

ఎన్ని కష్టాలు వచ్చిన టిడిపి కోసం నిరంతరం కష్ట పడే నాయకుడు బాబ్జీ అని సీనియర్ టిడిపి నాయకుడు పండరాజు సాంబయ్య కొనియాడారు. నమ్ముకున్న వారికోసం ప్రాణం పెట్టి, వారికి భరోసా కల్పించే గొప్ప నాయకుడు బాబ్జి అన్నారు.

పిన్నమనేని కుటుంబ వారసుడిగా విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ, నిరంతరం ప్రజల మంచి కోసం బాబ్జి చేస్తున్న సేవలు ఎనలేనివని గుడివాడ పండ్ల వర్తక సంఘ అధ్యక్షుడు గోకరకొండ బలరాం కొనియాడారు. భగవంతుని ఆశీస్సులతో బాబ్జి మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

బాబ్జి పుట్టినరోజు వేడుకల్లో అమ్మ ట్రస్ట్ చైర్మన్ మాటూరి రంగనాథ్, మాజీ కౌన్సిలర్లు తంగిరాల, మల్లిపూడి చక్రవర్తి, టిడిపి నాయకులు గుత్తా చంటి, కంచర్ల సుధాకర్, సయ్యద్ జబీన్,అద్దంకి కమల, పాలడుగు ధర్మపాల్,వంగపండు ఆదినారాయణ, ఆర్టీసీ యూనియన్ నాయకుడు దారం కొండ, జనసేన నాయకుడుదాసరి మహేష్, జర్నలిస్ట్ సంఘాల రాష్ట్ర నాయకుడు , మత్తి శ్రీకాంత్ , పట్టణ ప్రముఖులు సయ్యద్ గఫార్ ,దండమూడి సీతారామస్వామి, సాయన గాంధీ సామాజిక వేత్త డాక్టర్ ఆర్కే, పలువురు కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో బాబ్జి అభిమానులు, పలు స్వచ్ఛంద సామాజిక సంస్థల సభ్యులు పాల్గొన్నారు.


TEJA NEWS