కాకాణి ఆధ్వర్యంలో ఘనంగా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు”
SPS నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి అభిమానుల సమక్షంలో కోలాహాలంగా మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై.యస్.జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు.
భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జగనన్న అభిమానులు, మహిళలతో కిటకిటలాడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం.
మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన నేతలు.
జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలలో భాగంగా అందరి సమక్షంలో నెల్లూరు రూరల్ ఇంచార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి తో కలిసి భారీ కేక్ కట్ చేసిన కాకాణి.
కార్యకర్తలు, అభిమానుల కేరింతలు నినాదాలతో దద్దరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం.