వెయిట్ పెరుగుతున్న జనసేన పార్టీ
పవన్ కళ్యాణ్ తో మొదలైన జనసేన పార్టీ ఆతర్వాత నాదెండ్ల మనోహర్ లాంటివాళ్లు జాయిన్ అయ్యాక గత పదేళ్లుగా చిన్నగా ఏపీ రాజకీయాల్లో గెలిచేందుకు ఎంతగా ప్రయత్నం చేసినా పదేళ్లుగా పార్టీ పైకి లేవలేదు. గత ఏడాది పవన్ కళ్యాణ్ చంద్రబాబు, మోడీ తో పొత్తుపెట్టుకుని గెలిచి చూపించడం కాదు.. పొత్తులో భాగంగా తనకొచ్చిన 21 సీట్లను గెలిపించి అందరికి షాకిచ్చారు.
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ అండ అవసరం లేకున్నా.. పొత్తు ధర్మం పాటిస్తూ జనసేనకు, సేనానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ తర్వాత బలమైన పార్టీ గా జనసేన ఉంది. గత ప్రభుత్వం ఓడిపోయి కనీసం ప్రతిపక్షం లో కూడా నిలబలేకపోయింది.
అయితే ఇప్పటివరకు జనసేనలో బలమైన నాయకులు లేరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న నాదెండ్ల లాంటి నాయకులు తప్ప. కానీ ఇప్పుడు మాత్రం జనసేన పార్టీ వెయిట్ పెరుగుతుంది. కారణం వైసీపీ పార్టీ నుంచి బయటికొస్తున వాళ్లంతా జనసేన వైపు చూస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ని వీడిన బాలినేని జనసేనలో జాయిన్ అయ్యేందుకు రెడీ అవగా.. మరో వైసీపీ మాజి ఎమ్యెల్యే సాదినేని ఉదయభాను కూడా వైసీపీ కి రాజీనామా చేసి జనసేనలో చేరేందుకు సిద్ధం అవుతున్నారట.
అటు టీడీపీ కన్నా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన లో చేరితే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని చాలామంది మాజీ నేతలు భావిసున్నారని టాక్ ఉంది. మరి ఈ లెక్కన వచ్చే ఎన్నికల నాటికి జనసేన పార్టీ కీలక నేతలలో అతి పెద్దపార్టీగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.