TEJA NEWS

దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలో జనసంద్రంలా మరీనా కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఝాన్సి రాజేందర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్న గ్రామ ప్రజలు..

పార్లమెంట్ ఎన్నికల నేపత్యంలో కడవెండి,చీపరలబండ తండా,పొట్టిగుట్ట తండా,గ్రామాలలో ఊరూరా ప్రచారం నిర్వహించి ఓటు అభ్యర్ధించిన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి ఝాన్సి రాజేందర్ రెడ్డి ..

పండుగలా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, ఊరూరా జై కాంగ్రెస్ అనే నినాదాలు, అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు, డా, కడియం కావ్య గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రజలు..

ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఎత్తున్న స్వాగతం పలికిన కడవెండి గ్రామ ప్రజలకు పెరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను, మీ అందరి సహకారంతో ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగింది, మన నియోజకవర్గన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది..

మీ అందరికి అండగా ఉంటా, నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తా, కళ్ళబొల్లు మాటలు చెప్పే ప్రతిపక్షాల మాటలు నమ్మకండి, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వెయ్యండి, రాహుల్ గాంధీ ని దేశ ప్రధాని గా గెలిపించండి..

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే దేశ అభివృద్ధి సాధ్యం, అన్ని రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభత్వమే అధికారంలోకి వస్తే దేశాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటాం, కడియం కావ్య గారి రెండు నెంబర్ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించండి..

రాబోయే ఎన్నికల్లో పల్లెపల్లెన కాంగ్రెస్ జెండా ఎగరాలి, మీరూ అందరూ కలిసికట్టుగా కష్టపడండి, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది..

ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, పార్టీ ముఖ్యనాయకులు, యూత్ నాయకులు, మహిళ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, తదితరులు, పాల్గొన్నారు..


TEJA NEWS