గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే, పూర్తిగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, బాధ్యులను విచారించడం ప్రభుత్వాల బాధ్యత.
ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి
Related Posts
ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు
TEJA NEWS ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి…
విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..!
TEJA NEWS విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదే..! విజయంపై ట్రంప్ రియాక్షన్ ఇదేఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని అన్నారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ…