TEJA NEWS

కుల గణనతోనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది

  • మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు

కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో శనివారం కొంపల్లి లోని కేవీఆర్ గార్డెన్స్ లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సర్వే పై నిర్వహించిన సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కూన శ్రీశైలం గౌడ్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ గారు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాహుల్ గాంధీ, ఖర్గే గార్ల ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గార్లు రాష్ట్రంలో కులగణన చేసి తీరుతామని ముందడుగు వేశారన్నారు. ఈ కులగనలతో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కులగణన చేయాలని ఉద్దేశంతో నవంబర్ తేదీలోపు కులగణనను పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందన్నారు.
ఈ సర్వే చేయడానికి ఇంటికి వచ్చిన అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అండగా ఉండి ప్రతి కుటుంబం వద్ద సర్వే వివరాలను వివరించే విధంగా అధికారులకు సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు,మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొలన్ హన్మంత్ రెడ్డి గారు,భూపతి రెడ్డి గారు,వజ్రేష్ యాదవ్ గారు, నక్క ప్రభాకర్ గౌడ్ గారు,బొంగునూరి ప్రభాకర్ రెడ్డి గారు, సత్యం శ్రీరంగం గారు, బండి శ్రీనివాస్ గౌడ్ గారు, బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రవణ్ కుమార్ గారు,బాలప్ప గారు, ఖాజాభాయ్,జక్కుల మహేష్,రంగారావు,బొబ్బ ప్రసాద్,గొల్ల జాన్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,బుచ్చిరెడ్డి గార్లతోపాటు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS