పార్టీ శ్రేణులకు “కాకాణి” విజ్ఞప్తి
నెల్లూరు జిల్లాలో భారీ వర్ష సూచనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ ప్రజలకు అందుబాటులో ఉండి, అవసరమైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి.
నెల్లూరు జిల్లాలో భారీ వర్ష సూచన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండి, అవసరమైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి.
౼ ప్రజలకు భారీ వర్షాలు, ఈదురు గాలుల పట్ల సమాచారం ఇచ్చి, అవగాహన కల్పించడం.
౼ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం.
౼ మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండేటట్టు చూడటం.
౼ తరలించిన ప్రజలకు భోజన సదుపాయం కల్పించడం.
౼ ప్రజలకు బయటకు వెళ్లకుండా తగు సూచనలు, సలహాలు ఇవ్వడం.
౼ ప్రజలు, పశువులు కరెంట్ స్తంభాలు, చెట్ల కింద నిలబడకుండా పర్యవేక్షించడం.
౼ పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు పొలాల్లోకి వెళ్ళకుండా, ఇంటి వద్దనే ఉండేలా చూడడం.
౼ కరెంటు స్తంభాలు తాకకుండా, కరెంటు సమస్యలు ఉన్న ప్రాంతాలలో అధికారులతో మాట్లాడి పరిష్కరించడం.
౼ పసిపిల్లలు, బాలింతలు అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలను గుర్తించి, అవసరమైన పాలు, పదార్థాలు సరఫరా చేయడం.
౼ అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు అందించడం.
౼ పూరి గుడిసెలు, పాడుబడిన ఇళ్ళలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం.
౼ అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య సేవలు చేపట్టడం.
౼ గ్రామాలలోని చెరువులకు భారీగా వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నందున ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
౼ వర్షాలు ముగిసి సాధారణ జీవితం మొదలు అయ్యేంతవరకు నేను, నాతో సహా జిల్లా స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ఇతర ముఖ్య నాయకులు, మండల స్థాయి, గ్రామస్థాయి, మున్సిపల్ స్థాయి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి, అవసరమైనచో అధికారులతో మాట్లాడి, అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, జిల్లా ప్రజలకు ఏ అవసరం వచ్చినా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని 8712603258 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నా.
ఎవ్వరికీ ఎటువంటి అవసరం వచ్చినా, జిల్లా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని విన్నవిస్తూ, తగు జాగ్రత్తలు పాటిస్తూ, ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నా