TEJA NEWS

వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం

ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి

కరోనా విపత్తు సమయంలో వడ్ల కొలత పుట్టికి అర్థం మార్చేసి అదనంగా 150 నుంచి 250 కిలోల ధాన్యం గుంజుకోవడాన్ని మరిచిపోని రైతులు

పేదలకు కరోనా సాయం పేరుతో కోట్ల రూపాయల చందాలు దండి నెల్లూరులో ప్యాలెస్ నిర్మించుకోవడంపైనా ప్రజల్లో విస్తృతంగా చర్చ

ప్రధానంగా వెంకటాచలం మండలంలో ప్రభుత్వ, పేదల భూములతో పాటు రిజర్వాయర్లు, చెరువులను వదిలిపెట్టకుండా కళ్ల ముందే జరిగిన వందల కోట్ల విలువైన గ్రావెల్ దోపిడీని మరిచిపోలేమంటున్న ప్రజలు

లెక్కకు మించి పాపాలు చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి వెంట ఇక నడవలేమంటున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు

అందరిలోనూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందనే అభిప్రాయం

తెలుగుదేశం పార్టీలోకి జోరుగా చేరికలు

నెల్లూరు వేదాయపాళెంలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వెంకటాచలం మండలం అనికేపల్లి పంచాయతీ గొలగమూడి ఎస్సీ కాలనీకి చెందిన 13 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక

కండువాలు కప్పి టీడీపీలోకి ఆత్మీయ ఆహ్వానం పలికిన సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

టీడీపీలో చేరిన వారిలో తాళ్లూరు వెంకటరమణయ్య, దారా రవి, దారా రామయ్య, పాళెపు చినరమణయ్య, తాల్లూరు చినరమణయ్య, కమతం రమేష్, ఆసాది బుజ్జి, బాణాల మస్తాన్, దారా వెంకటేష్


TEJA NEWS