విభిన్న మతాల ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యత
మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి
బొల్లారంలో భక్తిశ్రద్ధలతో కలశ యాత్ర ఊరేగింపు విభిన్న మతాల ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ పెద్దపీట వేస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు అన్నారు. మంగళవారం బొల్లారం మున్సిపాలిటీలో బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 300మంది మహిళలు భక్తిశ్రద్ధలతో చేపట్టిన కలశ యాత్రలో కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కలశ యాత్ర ఊరేగింపులో కుటుంబ సభ్యులతో పాల్గొని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి గారు మాట్లాడుతూ... మినీ ఇండియా బొల్లారంలో ఆయా రాష్ట్రాల ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని విధాల వలస కార్మిక కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఆ దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ:సంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రారెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వి.ప్రత్యుష రెడ్డి గారు, స్థానిక నాయకులు రాజ్ గోపాల్ గారు, దిననాధ్ గారు, శ్రీమన్నారాయణ గారు, రాజారామ్ గారు, జె.జె సింగ్ గారు, శ్రీను గారు, శ్రవణ్ గారు, విజయ్ గారు, నవీన్ గారు, మా అంభి మహిళా సేవా సమితి సభ్యులు దూర్గావతి దేవి గారు, పరంశీల గారు, గీతాదేవి గారు, ఆశ గారు, సుమిత్ర గారు, శివమణి గారు, మహిళలు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.