
కల్వకుర్తి నియోజకవర్గ నిరుద్యోగుల పాలిట వరం సుంకిరెడ్డి జాబ్ మేళా
రాపోతు అనిల్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి
నాగర్ కర్నూల్ జిల్లా సాక్షిత ప్రతినిధి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని 25 న సి కె ఆర్ ఫంక్షన్ హాల్ లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి అనిల్ గౌడ్ తెలిపారు. కల్వకుర్తి మండలం లోని యంగంపల్లి ,జిల్లెల్ల ,మార్చాలా ,కురుమిద్ద ,జీడిపల్లి తండా, జీడిపల్లి వెంకటాపూర్, వెంకటాపూర్ తండా , ఎల్లికట్ట తండా , ఎల్లికట్ట , తోటపల్లి , బెక్కెర గ్రామాలలో సుంకిరెడ్డి జాబ్ మేళా పోస్టర్లను స్థానిక ప్రజలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ గౌడ్ మాట్లాడుతూ ఈనెల 25న నిర్వహించబోయే జాబ్ మేళాలో 50 కి పైగా కంపెనీలతో పాటు 5000 కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ,కాబట్టి నియోజకవర్గ నిరుద్యోగులకు, యువతకు సుంకిరెడ్డి జాబ్ మేళా అనేది ఒక వరమని తెలిపారు. దీనిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య ను రూపుమాపే దిశగా సొంత ఖర్చులతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నటువంటి సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు నాయకులు తిరుపతిరెడ్డి , శ్రీకాంత్ రెడ్డి, రవి, శ్రీహరి,జంగయ్యగౌడ్, యాదయ్య, ప్రేమ్ కుమార్, సురేష్ , అంజి, రమేష్ , ఐలేన్, మల్లేష్, కురుమూర్తి,శంకర్,తిర్పతయ్య మరియు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.
