TEJA NEWS

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వం నుంచి సహాయం పొందుతున్న ఇతర ఉన్నత విద్యా సంస్థలు బెంచ్‌ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల కోసం ఐదు శాతం కంటే తక్కువ సీట్లను రిజర్వ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. బెంచ్‌ మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తులకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఐదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది..


TEJA NEWS