TEJA NEWS

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం

నిర్మల్ జిల్లా:జనవరి 11
నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా నికి మున్సిపల్‌ అధికారులు ఈరోజు తాళం వేశారు.

రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్‌ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ప్రైవేటు భవనంలో నడుస్తున్నది. అయితే పన్ను చెల్లించాలని ఎన్నిసార్లు నోటిసులు ఇచ్చి నప్పటికీ యజమానులు స్పందించడంలేదని అధికారులు తెలిపారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, బకాయిలు లక్ష రూపాయలు దాటడంతోనే ఆఫీస్‌కు తాళం వేశామని వెల్లడించారు. దీంతో సిబ్బంది, ప్రజలు కార్యా లయం ముందు పడిగాపు లు కాస్తున్నారు. స్లాట్‌ బుక్‌చేసుకున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


TEJA NEWS