కీలక అప్‌డేట్‌.. బ్యాంకులకు రూ.2000 నోట్లు ఎన్ని తిరిగి వచ్చాయో తెలుసా?

Spread the love

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన విషయం తెలిసిందే. మే 19, 2023న ప్రజలు తమ బ్యాంకు నుండి సెప్టెంబర్ 30, 2023 వరకు వాటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. దీని తర్వాత బ్యాంకు నుండి ఈ నోట్లను మార్చుకోవడానికి అనుమతి 7 అక్టోబర్ 2023తో ముగిసింది.

ఇవి ఇప్పటికీ చట్టబద్ధమైనవి. ఎవరి వద్దనైనా ఉంటే వారు ఆర్బీఐ నుండి మార్చుకోవచ్చు. అయితే దాదాపు 7 నెలలు గడిచినా రూ.2000 నోట్లన్నీ ఇంకా ఆర్బీఐకి రాలేదు.

ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. 97.76 శాతం రూ. 2,000 నోట్లు మాత్రమే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. ఇప్పుడు కూడా, రూ. 7,961 కోట్ల విలువైన నోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. అయితే మే 19, 2023 న, రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మార్కెట్లో చెలామణిలో ఉన్నాయి.

Print Friendly, PDF & Email

You cannot copy content of this page