TEJA NEWS

ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉంది: కిరణ్‌ రావు

ఆస్కార్‌కు మా సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉంది: కిరణ్‌ రావు
ఆస్కార్‌ అవార్డ్స్‌కు భారతదేశం నుంచి అధికారికంగా ‘లాపతా లేడీస్‌’ సినిమా ఎంపికైనందుకు గర్వంగా ఉందని ఆ చిత్ర దర్శకురాలు కిరణ్‌ రావు అన్నారు. “ఈ గుర్తింపునకు కారణమైన చిత్రబృందానికి ధన్యవాదాలు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను. ఈ సినిమాపై నమ్మకం ఉంచి ఎంపిక చేసిన సెలక్షన్‌ కమిటీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. దీనిపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకమే మమ్మల్ని ఆస్కార్‌కు వెళ్లేలా స్ఫూర్తినిచ్చింది.” అని ఆమె తెలిపారు.


TEJA NEWS