TEJA NEWS

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ (పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 59 మంది లబ్ధిదారులకు 59,06,844/- యాబై తొమ్మిది లక్షల ఆరు వేల ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 59 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఎమ్మెల్యే గాంధీ కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, రఘునాథ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్,గంగాధర్, చాంద్ పాషా, ఓ. వెంకటేష్, రజినీకాంత్, తిరుపతి, జాకీర్,పవన్ గౌడ్, నరేందర్ బల్లా మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


TEJA NEWS