TEJA NEWS

మళ్లీ వైకాపా వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు: వైకాపా పాలన మళ్లీ వస్తే వ్యాపారులు బతికే పరిస్థితి ఉందా?అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) ప్రశ్నించారు..

నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ”వ్యాపారాలు చేసుకుంటున్న వారిని తరిమేస్తారా? వారిని బెదిరించి గనులు స్వాధీనం చేసుకుంటున్నారు. 30 ఏళ్లుగా క్వార్ట్జ్‌కు సరైన ధర లేక ఇబ్బంది పడ్డారు..

ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర పలుకుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో క్వార్ట్జ్‌ గనులను మొత్తం స్వాధీనం చేసుకుంటున్నారు. వ్యాపారులు రోడ్డున పడే పరిస్థితి తీసుకొచ్చారు” అని మండిపడ్డారు..


TEJA NEWS