TEJA NEWS

రాయుడు గారి మిలటరీ హోటల్ ప్రారంభించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం (గుంటుపల్లి),

ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రాయుడు గారి మిలిటరీ హోటల్ ను మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ లోని డైనింగ్ ఏరియా, కిచెన్, స్పెషల్ గదులను పరిశీలించారు. వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ముందుగా హోటల్ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ని ఘనంగా స్వాగతించారు.ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS