కుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం లగ్గం
శంకర్ పల్లి: సహ కుటుంబంతో చూడవలసిన చిత్రం లగ్గం అని, వీక్షకులు అంటున్నారు. చాలా రోజుల తర్వాత బంధాలకు సంబంధించిన, విలువలు ఏ విధంగా ఉంటాయో ఒక ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు గుండెల్లో ఎలాంటి దుఃఖముంటుందో, ఒక ఉద్యోగి ఉద్యోగంలో తీరిక లేకుండా తల్లిదండ్రులను చూడకుండా ఉంటున్నప్పుడు ఆ ఉద్యోగికి ఎలాంటి బాధ ఉంటుందో, షడ్రుచులు కలిగిన చిత్రం లగ్గం అని వీక్షకులు తెలిపారు.
ఈ లగ్గం చిత్రం చూసిన ప్రతి ఒక్క వీక్షకుడు ఆనందం, మరియు ఆనందభాష్పాలతో, థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. ఈ లగ్గం చిత్రం ఈ సంవత్సరం ఉత్తమ కుటుంబ చిత్రంగా నిలుస్తుందని, అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చినటువంటి చిత్రాలలో ఈ లగ్గం చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని చిత్రం చూసినటువంటి వీక్షకులు తెలిపారు.ఈ చిత్రం నిర్మించినటువంటి చిత్ర నిర్మాత వేణుగోపాల్ రెడ్డి కి చిత్రంలో నటించినటువంటి నటీనటులందరికీ వీక్షకులు శుభాకాంక్షలు తెలిపారు.