మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎల్.బి నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ లోని జడ్జెస్ కాలనీ, శుభోదయ కాలనీ, విజయ్ శ్రీ నగర్ కాలనీ, సాయి నాథ్ కాలనీ, ఇందిరా నగర్, గణేష్ నగర్ ఫేజ్ – 1 & ఫేజ్ – 2, రాఘవేంద్ర నగర్ కాలనీ లలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి …
ఈ సందర్బంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎల్. బి నగర్ నియోజకవర్గం అంటే ఎంతో ఇష్టమని అన్నారు…
గత పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ని అత్యంత మెజార్టీతో ఏ విధంగా అయితే గెలిపించామో అదే నమ్మకం అదే విశ్వాసంతో మే 13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్నం సునీత – మహేందర్ రెడ్డి ని కూడా అత్యంత మెజారిటీతో గెలిపించాలని జక్కిడి ప్రభాకర్ రెడ్డి కోరడం జరిగింది.
అదేవిధంగా పలు కాలనీల లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలు కాలనీల సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.