TEJA NEWS

హైదరాబాద్ నిజాంపేట : ఇంటర్‌ విద్యార్థినిపై ఓ లెక్చరర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాచుపల్లి పరిధిలో ఓ విద్యాసంస్థకు చెందిన మహిళా కళాశాల వసతి గృహం విద్యార్థినులు ఈనెల 2న కళాశాల బస్సులో వెళ్లి వస్తుండగా.. ఓ విద్యార్థినిని లెక్చరర్‌ అసభ్యంగా దూషించాడు. విషయం తెలిసి లెక్చరర్‌తో పాటు వార్డెన్‌ను కళాశాల యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. సమాచారం తెలిసి విద్యార్థి సంఘం నేత పవన్‌ మంగళవారం వసతి గృహం వద్ద నిరసనకు దిగారు. ఈ విషయమై బాచుపల్లి సీఐ ఉపేందర్‌ మాట్లాడుతూ ఈ ఘటనపై ఫిర్యాదు ఇవ్వమని కోరినా బాధితురాలు స్పందించలేదని, ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


TEJA NEWS