సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెనమలూరు నియోజకవర్గంలోని కాటూరు, గొడవర్రు, ఈడుపుగల్లు గ్రామాల ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాల సౌరి ని, బోడె ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను కోరిన రాజేంద్రప్రసాద్ .
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ…
రాష్ట్రానికి, మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యవస్థలు అణిచివేతకు గురికాబడ్డాయని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే మనందరం కష్టపడి పెనమలూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమీ అభ్యర్థి బోడె ప్రసాద్ ని, మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఇది మన బిడ్డల మరియు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అని రాజేంద్రప్రసాద్ అన్నారు.