TEJA NEWS

సావిత్రి జ్యోతిరావు పూలే గారి ఆశయాలను కొనసాగిద్దాం విద్యార్థి యువతీ యువకులకు
కొనసాగించాలని. పి వై ఎల్ పిలుపు
————————————– శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ. జూనియర్ కాలేజ్ నందు సావిత్రి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది శుభ సందర్భంగా పి వై ఎల్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వై ఆశీర్వాదం కాలేజ్ లెక్చలేరు సూర్యనారాయణ. వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయులుగా సావిత్రి పులి గారు
తాడిత పీడిత ప్రజల సంక్షేమం కోసం , సమాజ మార్పు కోసం వారిని చైతన్య పరచడానికి జీవితాంతం కృషిచేసిన ఆదర్శ విప్లవ చైతన్య మూర్తి, సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే . విద్యా ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి భారత దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్త్రీ విద్యను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే . దక్షిణ మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని నయాగావ్ అనే చిన్న పల్లెటూరులో 1831వ సంవత్సరమున జనవరి 3 తేదీన జన్మించారు , 9 ఏళ్ల సావిత్రిబాయికి 13 ఏళ్ల జ్యోతి బాపూలేతో 1840 సంవత్సరంలో వివాహం జరిగింది . విద్యను అభ్యసించడానికి తద్వారా నూతన జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రతి స్త్రీ, పురుషులకు , బాలలందరికి హక్కు ఉన్నదని ఆ హక్కు సహజమైనదని విశ్వసించిన తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలే తో ఏకీభవించి ముందు భర్త దగ్గరే చదువుకుంది. తర్వాత ఆయనతో కలిసి మహిళ విద్య వ్యాప్తి కోసం ఇతర సాంఘిక సంస్కరణల కోసం తీవ్రంగా కృషి చేశారు. మొదటి బాలిక పాఠశాలను 1848లో పూణేలో ఒక భవంతిలో ప్రారంభించారు. ఈ దంపతులు 1851 వ సంవత్సరంలో సెప్టెంబర్ నెల 18వ తేదీన పూణేలోని రాస్తాపేట అమ్మాయిల కోసం మరొక పాఠశాలను ప్రారంభించారు . సావిత్రిబాయి పాఠాలు చెప్పేందుకు స్కూల్ కి వెళ్తున్న దారిలో సాంప్రదాయవాదులు ఆమెపై పేడ, రాళ్లు విసరడం వంటి అవమానాలకు గురి చేయగా ఇవి నాకు పూలతో సమానం ఇలా ప్ప్రోత్సాహం ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందని ప్రతిస్పందించారు. ఇలా అవమానాలు ఎదుర్కొన్న తరుణంలోనే పూలే దంపతులు ఇంటి నుంచి బహిష్కృతులయ్యారు. అయినా తమ మార్గాన్ని వదులుకోలేదు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం, స్త్రీల కోసం ఆశ్రమాలను స్థాపించటం, విద్యాలయాలు స్థాపించడం మానలేదు . ఓ వితంతు కుమారుని దత్తత తీసుకొని పెంచుకున్నారు . 1876 -77 లో మహారాష్ట్రలో అతి భయంకరమైన కరువు వచ్చినప్పుడు తమ సత్యశోధ సమాజ్ ద్వారా అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేసి అనార్తులను ఆదుకున్నారు. సావిత్రిబాయి సమకాలీన సమస్యలు విద్య, సాంఘిక సంస్కరణ వంటి వాటిపై ఆరు పుస్తకాలు రాశారు. ఉపన్యాసాలు ఇచ్చారు . ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ అదే వ్యాధి సోకి 1897 మార్చి 10వ తేదీన 66 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు . ఆమె సేవలు చిరస్మరణీయం.
ఈ కార్యక్రమంలో కాలేజీ లెక్చలేర్లు మరియు.ప్రగతిశీలవజన సంఘం పి వై ఎల్. నాయకుడు వై సాల్మన్ రాజు. ఐ ఎఫ్ టి యు నాయకులు వై శీను పి మల్లికార్జున ఏ బెనహర్. జడ్డా బాబురావు గడ్డం చెన్నయ్య. విద్యార్థులు సావిత్రి పులే గారికి నివాళులర్పించడం జరిగింది తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS