ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిదుద్దాం.
*7లక్షలకు పైగా భారీగా జరిమానాలు విధింపు.
*నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన కమిషనర్ ఎన్. మౌర్య
ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలుప్రాంతాల్లో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బంది తో కలసి దుకాణాల్లో అకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులకు సుమారు ఏడు లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా పిర్యాదులు వస్తున్నాయని అన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమం లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మేజర్ గా ఉన్న మూడు హోల్ సేల్ దుకాణాల్లో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని, భారీగా జరిమానాలు విధించడం జరిగిందన్నారు.
హోల్ సేల్ దుకాణాల నుండి తెచ్చి చిన్న చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారికి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, తదితర ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్స్, స్పూన్స్, ప్యాకింగ్ కవర్స్, అమ్మితే దుకాణల లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. బయో డిగ్రిడేబుల్ కవర్లు అమ్మాలని దుకాణదారులకు సూచించారు. అధిక మొత్తం లో ప్లాస్టిక్ కవర్లు అమ్మే దుకాణలపై లక్షల్లో ఫైన్ లు వేశామని చెప్పారు. ఒక దుకాణానికి 2.90లక్షల రూపాయల భారీ జరిమాన విధించామని అన్నారు. అలాగే నగరంలోని పలు దుకాణాలకు జరిమానాలు విధించామని అన్నారు. ప్రజలు కూడా పేపర్ కవర్స్, జ్యూట్ బ్యాగ్స్ ను ప్రజలు ఎక్కువగా వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత నగరం గా తిరుపతి నీ తీర్చిదిద్దేందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీల్లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు ఉన్నారు.