TEJA NEWS

మొక్కల్ని నాటుదాం…పర్యావరణానికి ఊపిరి పోద్దాం…కాలుష్యాన్ని తరిమికొడదాం…ఆరోగ్యంగా జీవిద్దాం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు .

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం,

మొక్కల్ని నాటి, పర్యావరణానికి ఊపిరి పోసి, కాలుష్యాన్ని తరిమికొట్టి, మనమందరం ఆరోగ్యంగా జీవిద్దామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.

ఇబ్రహీంపట్నం మండలంలోని జాపూడి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణంలో ఆయన ఉదయం మనం-వనం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. రావి, వేప, నాగమల్లి, తదితర మొక్కలు నాటి మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ

ఏపీలో పచ్చదనం పెంపొందించేందుకు మహాకూటమి ప్రభుత్వం మనం-వనం కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారన్నారు.

వృక్ష సంపదతో ఆహ్లాదకర వాతావరణం ఉంటుందన్నారు. హాయినిచ్చే నీడతో పాటు, అందమైన పూలు, ఫలసాయంతో మానవ జాతి మనుగడకు వృక్షాలు ఎంతో మేలు చేస్తాయన్నారు. కాలుష్యానికి విరుగుడుతో పాటు ఆరోగ్యానికి తోడు వృక్షాలేనన్నారు. గత కొన్నేళ్లుగా చెట్లను వివిధ రకాల అవసరాల పేరుతో విచ్చలవిడిగా కొట్టేయడంతో వాయుకాలుష్యం పెరిగిందన్నారు. కాలుష్య రక్కసి కారణంగా అనారోగ్య సమస్యలూ వెంటాడుతున్నాయన్నారు.

కాలుష్య నివారణకు మహాకూటమి ప్రభుత్వం ‘వన మహోత్సవం’ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, రోడ్లకు ఇరువైపులా మొక్కల్ని నాటాలని.. వాటిని నాటి వదిలేయకుండా వాటిని పెంచే బాధ్యత కూడా ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. పచ్చదనం పెరిగితే రాష్ట్రం ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. కాలుష్య కోరల్లో నుంచి బయటపడొచ్చన్నారు. వృక్షో…రక్షితి రక్షితః అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS