TEJA NEWS

మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసన
ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

అనకాపల్లి జిల్లా పరవాడ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ విధానం ద్వారా తమ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నామని వాపోయారు. ఈ మేరకు మండల వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల షట్టర్లు డౌన్ చేసి నిరసన వ్యక్తం చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అహర్నిశలు పనిచేసి ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకొచ్చామన్నారు.

అలాంటి తమను ఎటువంటి ఉద్యోగ భద్రత లేకుండా తొలగిస్తామని ప్రభుత్వం చెబుతుందన్నారు.ఉద్యోగాల నుంచి తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొన్నాడ రవి, యాసవరపు నాయుడు,లాలం ముత్యాలనాయుడు, ఆదిరెడ్డి సత్యారావు, వర్రి నరిసింహమూర్తి, జగన్నాధం, స్వామి, వడిశల అనోజ్, పైల లక్ష్మణరావు, పైల నరేష్, గంగునాయుడు,గేదెల నాగేశ్ మరియు సూపర్వైజర్స్ సేల్స్మెన్లు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS