TEJA NEWS

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.
వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర కార్యక్రమానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని కోరారు.

లక్షలాది మంది రైతాంగానికి, కోట్లాది మంది ప్రజానీకానికి న్యాయం తోపాటు, మూడు పంటల పండించే వెసులుబాటు కి వీలుంటుందని ఈ సందర్భం గా లోకేష్ కి విన్నవించారు. వంశధార, బహుదా అనుసంధానం ద్వారా ఉద్దానంలోని మూడు నియోజక వర్గాల రైతాంగానికి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.

వంశధార జల సాధన కమిటీ కన్వీనర్ డాక్టర్ ప్రధాన శివాజీ, మాజీ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శమళ్ళ (svv)ప్రసాదరావు, ఏఎంసి మాజీ చైర్మన్ పండి దేవేంద్రమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరోవైపు టీడీపీ అధికారం లోకి వచ్చాక నదుల అనుసంధానం ప్రక్రియ చేస్తామని లోకేష్ సభాముఖంగా హామీ ఇచ్చారు.


TEJA NEWS