మద్దిరాల మండలం ఐకెపి కేంద్రాల్లో పేరుకుపోయిన సన్నధాన్యం
గోదాముల వద్ద త్వరగా దిగుమతులు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న అన్నదాతలు
సూర్యపేట జిల్లా : సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు పేరుకుపోయి ఉన్నాయి. లోడ్ అయిన ధాన్యం అన్లోడ్ కాకపోవడంతోనే ఈ సమస్య నెలకొంటుందని ఆయా కేంద్రాలలో ధాన్యం పోసిన రైతులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఐకెపి నిర్వాహకులు సైతం ఈ సమస్యను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గోదాముల వద్దకు వెళ్లిన లారీలు తొందరగా దిగుమతులు కాకపోవడంతో రైతులతో పాటు తాము కూడా రోజులు తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. గోదాముల వద్ద కూడా తమకు సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. ఒకలోడు ధాన్యం ఎత్తి మరోలోడు ఎత్తాలంటే గొడవున్ కు వెళ్లిన లారీ తిరిగి వస్తే తప్ప కాంటాలు అయిన ధాన్యం లోడు ఎత్తే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని గోదాము నిర్వాహకులతో మాట్లాడి తమకు పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.