బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

TEJA NEWS

ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన కీర్తి చేకూరి ఐ ఏ ఎస్ గారిని వారి చాంబర్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ మన గుంటూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య విభాగాలలో కలిపి మూడు వేల మంది కార్మికులు ఔట్సోర్సింగ్ పద్ధతి పై విధులు నిర్వహిస్తున్నారని వీరందరూ కూడా తమ కుటుంబ అవసరాల కోసం మరియు వారి పిల్లల చదువుల కోసం వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నెలకు 100 కి ఐదు రూపాయలు, పది రూపాయలు వడ్డీకి రుణాలు తీసుకొని ఆ రుణాలలో అసలు చెల్లించలేక నెల నెల వచ్చే జీతం లో సగం ఆ వ్యాపారస్తులకు వడ్డీ చెల్లిస్తూ కార్మికుల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని తమరు పెద్ద మనసు చేసుకొని కార్మికుల జీతాలకు సంబంధించిన ఖాతాలు ఉన్న యూనియన్ బ్యాంకు అధికారులతో మాట్లాడి కార్మికులందరికీ రుణాలు మంజూరు చేయించిన యెడల వడ్డీ వ్యాపారస్తుల వద్ద ఉన్న బాకీలను కార్మికులందరూ కొంతమేరకు తీర్చి నెల నెల వడ్డీ వ్యాపారస్తులకు ఏదైతే వడ్డీ రూపంలో చెల్లిస్తున్న మొత్తాన్ని బ్యాంకులలో కిస్తీలు చెల్లించుకుంటూ మిగిలిన జీతంతో కుటుంబాలను పోషించుకుంటారని కార్మికుల దయ పరిస్థితిని అర్థం చేసుకొని బ్యాంక్ అధికారులతో మాట్లాడి బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతూ ఈ బ్యాంకు రుణాలను బాపట్ల మున్సిపల్ కార్మికులకు అక్కడి కమిషనర్ గారి చొరవతో కెనరా బ్యాంకు వారు రుణాలు మంజూరు చేశారని ఆ విధంగా గుంటూరు నగరపాలక సంస్థలు కూడా ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ రుణాలు మంజూరు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ నాగిపోగు సుమన్ , భాస్కర్, బాలాజీ, నాగేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS