మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం… సామాజిక తనిఖీ సమన్యయ సమావేశం
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెలుగు కార్యాలయంలో MNREGS సిబ్బందికి జరిగిన సామాజిక తనిఖీ సమన్వయ సమావేశానికి ముఖ్యఅతిథిగా పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2023-2024 సం నందు వివిధ శాఖల నందు చేపట్టిన పనుల పైన వివిధ శాఖల అధికారులతో సామాజిక తనిఖీ చేసి పనులను సామాజిక తనిఖీ సిబ్బంది పారదర్శకంగా చేపట్టవలనని మరియు సామాజిక తనిఖీ చేయవలసిన ఉపాధి హామీ పథకం కూలీలకు ఇంకా మెరుగ్గా ఉపయోగపడుతుందని తెలియజేసినారు. మండలంలో జరిగిన పనుల్లో భాగంగా వేతనాలు తదితర అంశాలపై అధికారులు సోషల్ ఆడిట్ చేసి డిఆర్పీలు నివేదికలు సమర్పించారు. సామాజిక తనిఖీ ప్రజావేదికలో క్షేత్ర స్థాయి సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, విధి నిర్వహణలో అలసత్వం వద్దని పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులుకు సూచించారు. ఈ కార్యక్రమంలో పరవాడ APO గోవిందా రావు, వసంత్, పరవాడ ఎంపీడీవో కీర్తి స్పందన, హౌసింగ్ AE రెడ్డి, గొర్లివాన్నిపాలెం సర్పంచ్ గొర్లి గోపి అమ్మలు, నాయుడు పాలెం సర్పంచ్ కుండ్రాపు వరలక్ష్మి సీతారామయ్య గారు, సుపెరిండెంట్ రాంబాబు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు, టెక్నికల్ అసిస్టెంట్ లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంసమావేశం
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
TEJA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్ మాజీ…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
TEJA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…