కృష్ణాజిల్లా
గుడివాడ నియోజకవర్గo
గుడివాడలో ఈనెల 18న చంద్రబాబు గారి రా.. కదిలిరా .. బహిరంగ సభను జయప్రదం చేయండి : మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ పిలుపు
ఈ నెల 18న గుడివాడ లో నిర్వహించనున్న రా.. కదలి రా. .బహిరంగ సభకు ఈ రోజు జిల్లా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నో కష్ట నష్టాలను ఎదురొన్న నారా చంద్రబాబు నాయుడు గారి కి మద్దతుగా నిలిచి ఈ నెల 18న నిరహించనున్న రా.. కదలిరా..బహిరంగ సభలో భారీగా ప్రజలు పాల్గొని న భూతో న భవిష్యత్ ఆన్న రీతిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలోజిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ ,మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర,మండలి బుద్ధ ప్రసాద్,పిన్నమనేని వెంకటేశ్వరరావు,ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, జిల్లా లోని నియోజక వర్గాల టిడిపి ఇంచార్జి లు వెనిగండ్ల రాము,కేశినేని చిన్ని ,బొడే ప్రసాద్,కాగిత కృష్ణ ప్రసాద్, వర్లకుమార్ రాజా, రావి వెంకటేశ్వరరావు,జన సేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ , బీసీ నాయకులు కొనకళ్ళ బల్లయ్య మరియుటిడిపి,జనసేన నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.