TEJA NEWS

తాగిన మైకంలో చెరువులో పడి వ్యక్తి మృతి…,,,

పరవాడ: తాగిన మైకంలో చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన దేశపాత్రునిపాలెంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో దేశపా త్రునిపాలెం శివారు సాయినగర్కాలనీకి చెందిన ఇమాన్యుయేల్(27) మరణించినట్లు పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. వివరాలు. పెయిం టర్ గా పనిచేస్తున్న ఇమాన్యుయేల్ భార్య రజనీతో కలిసి సాయినగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. తన స్నేహితులైన రవికుమార్(స్టీల్స్టాంట్ ఉద్యోగి), రాజుతో కలిసి ఉదయం మద్యం సేవించాడు. అనంతరం తనను ద్విచక్ర వాహనంపై ఇంటికి తీసుకువెళ్లాల్సిందిగా రవికుమార్ను కోరాడు. మాటలాడుకుంటూ ముగ్గురూ కలిసి దేశపాత్రునిపాలెం చెరువు వైపు వచ్చారు. చెరువు వద్ద ఇమాన్యుయేల్, రవికుమార్ మద్య వాగ్వాదం జరిగింది. ఒకరిని ఒకరు నెట్టుకుంటూ ప్రమాద వశాత్తూ ఇరువురూ చెరువులో పడిపోయారు. రవికుమార్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఈతరాని ఇమాన్యుయేల్ చెరువులో మునిగిపోతుండగా – స్థానికులు బయటకు తీశారు. అప్పటికే ఇమాన్యుయేల్ ప్రాణాలు కోల్పో యాడు. సమాచారం అందుకున్న సీఐ మల్లికార్జునరావు ఘటనాస్థలికి వెళ్లి వివ రాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్ప త్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.


TEJA NEWS