చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలవాలి ప్రధానిగా మళ్లీ మోడీ కావాలని శంకర్‌పల్లి మండల బిజెపి మహిళా అధ్యక్షురాలు గాయత్రి రమేష్ గౌడ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ కేంద్రంలో మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అడిగారు. అనంతరం గాయత్రి మాట్లాడుతూ చేవెళ్లలో బిజెపి గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఓటర్లను కోరారు. భారీ మెజార్టీతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని, కేంద్రంలో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
కొండ గెలవాలి ప్రధానిగా మోడీ కావాలి: మండల బిజెపి పార్టీ ప్రెసిడెంట్ గాయత్రి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…