TEJA NEWS

Mantri Farooq who started Unique & Nice Restaurant

యూనిక్ & నైస్ రెస్టారెంట్ ప్రారంభించిన మంత్రి ఫరూక్

నంద్యాల స్థానిక పద్మావతి నగర్ లో రంగా వంశీకృష్ణ ఏర్పాటుచేసిన యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ ని న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించడం జరిగింది

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఒకరిపై ఆధారపడకుండా స్వయంకృషితో వారి కాళ్లపై వారు నిలబడేలా వారికి నైపుణ్యం ఉన్న వాటిలో ముందుకు వెళ్లడమేగాక గాక మరి కొందరికి ఉపాధి కల్పించడం చాలా మంచి శుభ పరిణామం అన్నారు . నంద్యాలలో ఇటువంటి రెస్టారెంట్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ పోటీ ప్రపంచంలో పోటీపడుతూ అందరికీ నాణ్యమైన భోజనం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పద్మావతి నగర్ లో రంగా వంశీకృష్ణ యూనిక్ అండ్ నైస్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాలతో పోటీ పడేవిదంగా ఈ రెస్టారెంటును నంద్యాల ప్రజలకు అందిబాటులో తీసుకోరావడం అబినందనీయమన్నారు. నంద్యాల ప్రజలకు రుచికరమైన నాణ్యతమైన ఆహారాన్ని యాజమాన్యం అందిస్తుందన్న అశాభావాన్ని వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ , ఎన్ఎండి ఫయాజ్ , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి , ఆనంద్ గురూజీ , చలం బాబు , మధు , కౌన్సిలర్ శ్యామసుందర్ లాల్ , డాక్టర్ మధు , బుజ్జి , కాసెట్రీ చంద్ర తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS