TEJA NEWS

మండలంలోని భైరవునిపల్లికి చెందిన విపక్ష పార్టీ నుంచి పలు కుటుంబాల వారు కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో వీరికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. కాంగ్రెస్లో చేరిన వారందరికీ అండగా ఉంటామని అభయం ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా.. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే అత్యధికంగా అమలు చేస్తున్నామని, కోడ్ ముగిశాక మిగిలిన అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ లో చేరిన వారిలో..:
పోలంపల్లి నవీన్, భరత్, పెద్దపాక అర్జున్, చంద్రకాని మధు, లింగ బోయిన నరసయ్య, పెద్దపాక రాము, బద్రి, నరేష్, మాతంగి మల్లయ్య, చట్టూ మలేదు తదితరులు ఉన్నారు.


TEJA NEWS