TEJA NEWS

కూటమి ప్రభుత్వానికి బొత్స థ్యాంక్స్

మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌ను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలకు నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో చేసిన అభివృద్ధిని మరోసారి చూపించారన్నారు. నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో చూపించారన్నారు. నాడు-నేడు ద్వారా స్కూల్స్‌లో మిగతా పనులను పూర్తి చేస్తామని చెబితే బావుండేదని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

జనవరి 3న ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు బొత్స సత్యనారాయణ. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించామని.. వర్ష సూచన ఉండటంతో రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులు ఇబ్బందులు పడకుండా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. ఈనెల 13న అన్ని కలెక్టరేట్‌లో వినతిపత్రలు అందజేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన విద్యత్ చార్జీలు పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రాలు అందజేస్తామన్నారు.

అలాగే విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. కరెంట్ తగ్గిస్తామని చెప్పి పెంచారని.. ఆరు స్లాబ్స్‌లో ఛార్జీల భారం ప్రజలపై మోపింది అన్నారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారని.. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలన్నారు.
విశాఖపట్నంలో కంటైనర్‌లో డ్రగ్స్ లేదని సీబీఐ చెప్పడంతో.. విశాఖపై ఉన్న డ్రగ్స్ మచ్చ పోయిందన్నారు బొత్స సత్యనారాయణ. డ్రగ్స్‌కు సంబంధించి తమపై విష ప్రచారం చేశారని.. ఎన్నికల్లో లబ్ధి పొందారన్నారు. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. అంతేకాదు సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తాను అన్నారు. విశాఖ డైరీపై వేసిన సభా సంఘంపై ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని లేఖ రాశామన్నారు. ఈ సభా సంఘంలో శాసనమండలిలోని సభ్యులను భాగస్వామ్యం చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మాటలు పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని సెటైర్లు పేల్చారు


TEJA NEWS