TEJA NEWS

మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ స్వామి గౌడ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శంబిపుర్ రాజు అధ్యక్షతన నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చామకుర మల్లారెడ్డి , కేపీ వివేకానంద్ , మాధవరం కృష్ణారావు , బండారి లక్ష్మారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి , నందికంటి శ్రీధర్ , జహంగీర్ పాషా , సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు..

ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నవంబర్ 29 రోజు అంటేనే తెలంగాణ చరిత్రను మలుపుతిప్పిన రోజు

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చి రాష్ట్ర సాధన కోసం మృత్యువును సైతం ముద్దాడేందుకు కేసీఆర్ గారు తెగించిన రోజు

తెలంగాణ ప్రజలే శ్వాసగా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా ఉద్యమం సాగించి..స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం.

ఇన్నేళ్ళు గడిచినా ఆ నాటి పరిస్థితులు ఇంకా నా ముందు కదలాడుతూనే ఉన్నాయి. కేసీఆర్ చిత్తశుద్ధి, నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది.

కోట్లాది మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ గారు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్దమైన రోజు

తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత కేసీఆర్ పోరాట స్పూర్తిని స్మరించుకుంటూ… యావత్ ప్రజానీకాన్ని జాగృతం చేస్తూ..

ఈ రోజు నిర్వహించిన ‘దీక్షా దివస్’ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు..


TEJA NEWS