జగిత్యాల బి ఆర్ యస్ పార్టీ కార్యాలయం లో పత్రిక విలేఖరుల సమావేశం…
జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ…
సీఎం రేవంత్ రెడ్డి నిన్న వరంగల్ సభలో మాజీ సీఎం కేసీఆర్, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , ఎమ్మెల్సీ యల్ రమణ , మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్, దావ వసంత, తుల ఉమ…
నిన్న వరంగల్ లో బి ఆర్ యస్ పార్టీ మొలకను మళ్ళీ మొలవనివ్వ అని, మధ్యానికి, తాగుడుకు అధ్యక్షులు కేసీఆర్ ని చేస్తా అని సీఎం మాట్లాడటాన్ని తెలంగాణ సమాజం హర్షించదు.. తెలంగాణ రాష్టాన్ని సాధించారు కేసీఆర్ …మహిళలను కోటిశ్వరులను చేస్తా అని చెప్పారు కానీ ముందు మహిళలకు 2500మహాలక్ష్మి పెన్షన్ ఇవ్వండి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటం బూతులు మాట్లాడటం ప్రజలు గమనిస్తున్నారని హామీలు, గ్యారంటీలు అమలు, రుణమాఫీ, రైతు బంధు ఇవ్వడం మీద ద్రుష్టి పెట్టండి… కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదు.. జగిత్యాల జిల్లా ప్రజల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం..
ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ…
జాతీయ స్థాయిలో కేసీఆర్ అన్ని పార్టీ ల మద్దతు కూడా గట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ని సీఎం రేవంత్ వరంగల్ లో అసభ్య పదజాలం తో మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం..
పరిపాలన అనుభవం లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం బందు చేసి పరిపాలన పై ద్రుష్టి పెట్టండి..
సుంకే రవిశంకర్ మాట్లాడుతూ..
బట్టెబాజ్ రేవంత్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు.. కేసీఆర్ పట్ల మీ వైఖరి ని తీవ్రంగా ఖండిస్తున్నాం
దావ వసంతమాట్లాడుతూ…
తెలంగాణ స్వప్నికుడు కేసీఆర్ ని తిట్టడం బాధాకరమైన విషయం..తీవ్రంగా ఖండిస్తున్నాం
రేవంత్ తిట్లకు బ్రాండ్ అంబాసిడర్..
చలిమేడా లక్ష్మీనర్సింహా రావు,లోక బాపు రెడ్డి, రామ్మోహన్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..