సైనిక సంక్షేమ భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి….
-జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
నిర్మాణ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్
ఉమ్మడి ఖమ్మం
సైనిక సంక్షేమ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి, భవనాన్ని అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్ జిల్లా సైనిక సంక్షేమ అధికారి కార్యాలయం సందర్శించి, భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
భవనంలోని ప్రతి అంతస్తు కలియ తిరిగి పూర్తయిన పనులు, మిగులు పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. లిఫ్ట్ సామర్థ్యం, పనులన్ని ఎప్పటిలోగా పూర్తి చేసేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవన ప్రవేశం రెండు వైపులా వుండేలా చర్యలు తీసుకోవాలని, భవనం పైన చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకునేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ అన్నారు. మొదటి, రెండు అంతస్తులో చిన్న చిన్న పనులు వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. అధికారులు పనుల పురోగతిపై పర్యవేక్షణ చేయాలన్నారు. కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్, అధికారులు తదితరులు ఉన్నారు.