TEJA NEWS

TDP కార్యాలయంలో అందుబాటులో మంత్రులు

AP : పార్టీశ్రేణుల సమస్యల్ని స్వయంగా తెలుసుకోవడానికి వీలుగా మంత్రులు బుధవారం నుంచి మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండనున్నారు. CM చంద్రబాబు సూచన మేరకు శని, ఆదివారాలు మినహా రోజుకొకరు చొప్పున ఈ నెల 31వరకు పార్టీ కార్యాలయంలో ఉంటూ వినతులు స్వీకరించనున్నారు. మంత్రులతో పాటు ఒక్కో రోజు ఒక్కో ముఖ్య నాయకుడు కూడా అందుబాటులో ఉంటారని పార్టీ కార్యాలయం తెలిపింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS