TEJA NEWS

పటాన్చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ, చైతన్య నగర్ కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ది కాలంలో పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి ప్రతికగా తీర్చిదిద్దడంతో పాటు అవినీతిరహిత పాలన అందించామని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు సమస్యలన్నింటికీ పరిష్కారం చూపామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని అన్నారు.

హాజరైన పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు.


TEJA NEWS