కొండంగల్ నుంచే ప్రభుత్వంపై తిరుగుబాటు: ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్:
రాష్ట్రంలో ఏం జరిగినా బీఆర్ఎస్ కుట్ర ఉందని ప్రచారం చేస్తున్నారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.వికారాబాద్ జిల్లా ప్రభుత్వ అధికారులపై దాడి కేసులో అరెస్టయిన పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైల్లో ఈరోజు హరీష్ రావు కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారం తో పట్నం నరేందర్ రెడ్డిని కుట్రపూరితంగా అరెస్ట్ చేయించారని ఆరోపించారు.
కొడంగల్ నుంచే ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైం దన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శమన్నారు. ఎక్కడ ఏం జరిగినా బీఆర్ఎస్‌పై పెడుతున్నారని.. నిరుద్యోగులు, రైతులు, పోలీసులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తే అది బీఆర్ఎస్ చేయించిందని రేవంత్ అంటున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తమ భూముల కోసం గిరిజ నులు పోరాటం చేస్తే అది కూడా బీఆర్ఎస్ చేసిందనే అంటున్నారని మండిప డ్డారు. ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడడం ప్రతిపక్షాలుగా అది మా బాధ్యత అని హరీష్ రావు గుర్తుచేశారు.
తమకు కోపం ఉంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. కానీ అమాయక గిరిజన రైతులపై కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. వెంటనే వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.