మొంథా తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే జారే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గంలోని ప్రజలు
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గంలోని రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని సూచించారు. పంట నిల్వ కేంద్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశించారు. అతి భారీ వర్షాలు నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప బయటికి ఎవరు రావద్దని సూచించారు. నియోజకవర్గ అధికారులను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు.
