TEJA NEWS

సీఎం సహాయనిధి ఆరోగ్య పెన్నిధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
రూ. 3,40,00 విలువగల ఎల్ఓసీ (సిఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో 125 – గాజులరామరం డివిజన్ కి చెందిన రఫత్ ఉన్నిసా బేగం, 126 – జగద్గిరిగుట్ట డివిజన్ రింగ్ బస్తీ కి చెందిన వెంకట దీక్షిత, కొంపల్లి మున్సిపాలిటీ కి చెందిన పి.దేవేందర్ యాదవ్ ల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రఫాత్ ఉన్నిసా బేగం (రూ.1,00,000/-), వెంకట దీక్షిత (రూ.40,000/-) దేవేందర్ యాదవ్ ( రూ.2,00,000)లకు ఎల్ఓసీ మంజూరు చేయించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి ఆర్థిక భరోసానిస్తుందన్నారు.


TEJA NEWS