ఈరోజు 125-గాజుల రామారం డివిజన్ మెట్కానిగూడలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న స్వామి వారి జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ మహిమ గల దేవుడు మల్లన్న స్వామిని కొలవడం ద్వారా బాధలు తొలగి సుఖ సంతోషాలు చేకూరుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరి, డివిజన్ అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ వేణు యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, సూరారం డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు మల్లేష్ యాదవ్, బాలరాజు యాదవ్, గోపాల్ యాదవ్, సత్యనారాయణ యాదవ్, యాదగిరి యాదవ్, బాల మల్లేష్ యాదవ్, ఆంజనేయులు యాదవ్, నాగేష్ యాదవ్, భాస్కర్ యాదవ్, మహేష్ యాదవ్, సంపత్ యాదవ్, శివ తదితరులు పాల్గొన్నారు.