TEJA NEWS

కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీ దవాఖానాలలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. దవాఖానాలలో రోగులను ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా దవాఖాన డాక్టర్లతో మాట్లాడుతూ నెలవారీగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాలు బాగుండాలి అనే ఆకాంక్షతో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తే బస్తీ దవాఖానాలు సుస్థి పడేవిధంగా ఈ ప్రభుత్వం మరియు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దవాఖానా లలో కనీసం బీపీ బిళ్ళలు ,షుగర్ బిళ్ళలు లేకుండా టెస్టులు చేయడానికి పరికరాలు లేకుండా దయనీయమైన పరిస్థితులలో బస్తీ దవాఖానాలలో ఉన్నాయన్నారు ప్రభుత్వమేమో సంవత్సర వేడుకలను జరుపుకుంటుందని ఏమి సాధించారని ప్రజలకు ఏమి చేశారని సంవత్సరంలోనే బస్తి దవాఖానాలు కి వచ్చేవారి సంఖ్య తగ్గడానికి కారణం ప్రభుత్వం నిర్లక్ష్యమేనని మండి పడ్డారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం వాళ్ల వైఖరిని మార్చుకొని ప్రజల కోసం పనిచేసే విధంగా ఉండాలని లేకపోతే టిఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ కార్పొరేటర్ సబిహ గౌసుద్దీన్,మాజీ కార్పొరేటర్ బాబురావు, గౌసుద్దిన్ అంబటి శ్రీనివాస్,సత్యనారాయణ, ప్రభాకర్ గౌడ్, జిల్లా గోపాల్, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS