బాధిత కుటుంబాన్ని పరామర్శించిన…….ఎమ్మెల్యే మెగా రెడ్డి
కుటుంబానికి తాను ఎల్లవేళలా అండదండగా ఉంటానని భరోసా_*
*
వనపర్తి :
వనపర్తి నియోజకవర్గం శ్రీరంగపురం మండలం నాగరాల గ్రామం సెంటర్ 1కు చెందిన పులేందర్ కుటుంబాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరామర్శించారు
పులేందర్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు*_
కుటుంబం అధైర్య పడకూడదని కుటుంబానికి తను ఎల్లవేళలా అండదండగా ఉంటానని ఎమ్మెల్యే వారికి భరోసా కల్పించారు
చిన్నారుల విద్యాభ్యాసం ఇందిరమ్మ ఇల్లు కుటుంబానికి కావాల్సిన అందే సదుపాయాలను ఏర్పాటు చేయిస్తామని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సూచించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు
కార్యక్రమంలో శ్రీ రంగపురం, పెబ్బేరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు