TEJA NEWS

గుర్రం మల్లేశ్వరమ్మ మృతి పట్ల సంతాపం తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర,ఇరిగినేని, దారపనేని,బైరెడ్డి, గుర్రం

కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం సట్టుమడుగు గ్రామ సీనియర్ రాజకీయ నాయకులు దివంగత ఇరిగినేని తిరుపతి నాయుడు ముఖ్య అనుచరులు కీర్తిశేషులు గుర్రం శేషయ్య సతీమణి గుర్రం మల్లేశ్వరమ్మ మంగళవారం మృతి చెందారు. మల్లేశ్వరమ్మ మృతి పట్ల కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇరిగినేని రవీంద్రబాబు, కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్, పామూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బైరెడ్డి జయరామిరెడ్డి, పామూరు మండల టిడిపి నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు వారి కుమారులు గుర్రం రామసుబ్బారావు, నరేంద్ర, కుమార్తె రమణమ్మ, కీర్తిశేషులు గుర్రం శేషయ్య సోదరుని కుమారులు గుర్రం నాగేశ్వరరావు, గుర్రం రమేష్ లకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లేశ్వరమ్మ మృతి పట్ల చిలంకూరు మాజీ సర్పంచ్ యరశింగు ముసలయ్య, రాజకీయ సీనియర్ నాయకులు పచ్చావా పేరయ్య, దేవరపు డాల్ మాల్యాద్రి, వగ్గంపల్లి టిడిపి నాయకులు చావా సుబ్బారావు, యరశింగు వెంకటేశ్వర్లు, అల్లు శ్రీనివాసులు, నూతంగి నారాయణ అండ్ బ్రదర్స్, దేవరపు మాల్యాద్రి అండ్ బ్రదర్స్, పచ్చావా వెంకటేశ్వర్లు అండ్ బ్రదర్స్, డాక్టర్ కోటపాటి శ్రీ చరణ్, బబ్లు బ్రదర్స్ పామూరు మండల టిడిపి శ్రేణులు, సానుభూతిపరులు మల్లేశ్వరమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.