
జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని ఐ జె యు ఆధ్వర్యంలో డీఈఓ కు వినతి .
వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని TUWJ(IJU) నాయకులు డిమాండ్ చేస్తూ అందుకు సంబంధించిన సర్క్యులర్ జారి చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూజే ఐజేయు నేతలు వనపర్తి జిల్లా విద్యా శాఖ అధికారి అబ్దుల్ ఘని కి వినతి పత్రం అl అందజేశారు. దీంతో స్పందించిన అధికారి ఉచిత విద్యకు సంబంధించిన సర్క్యులర్ ను త్వరలో జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులుమాధవరావు, రాజు, ఉషన్న నరసింహ రాజ్, చీర్ల అంజి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
