TEJA NEWS

రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన…………………. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి
ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
వనపర్తి జిల్లాలో జూన్ 3 నుంచి జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా మంగళవారం పానగల్ మండలంలోని బండపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ సందర్శించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చారని, భూ సమస్యలు ఏమున్నా నిర్ణిత ప్రొఫార్మలో పూరించి అధికారులకు ఇవ్వాలని, అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. సాదా బైనామ పై వివరిస్తూ 2020 సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని ఇప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని, మిగిలిన సాదా బైనామా దరఖాస్తుల విషయంలో కోర్టు నుండి సూచనలు వచ్చాక పరిశీలించడం జరుగుతుందన్నారు.
భూ సమస్యల పై దరఖాస్తు నింపడానికి ఇబ్బంది ఉన్న వారికి సహాయం చేసేందుకు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ లను పెట్టడం జరిగిందని, వారి సహకారం పొందాలని సూచించారు. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు చేసుకొని భూ తగాదాలు, సమస్యలు పరిష్కరించుకోవాలని గ్రామ ప్రజలను సూచించారు.
షెడ్యూలు ప్రకారం గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసిల్దార్ సత్యనారాయణ రెడ్డి, ఆర్.ఐ ఇతర సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.